మంచి జరుగుతుందన్న నమ్మకం.. చెడు జరుగుతున్న భయం.. మనిషిని ఏదైనా నమ్మేలా చేస్తాయి..అందులో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. భయంతో నమ్మాల్సినవి బోలెడు.. పాటిస్తే పోయేదేముందన్న ధోరణి. నేటికి కొన్నింటిని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అవి మూఢనమ్మకాల లేక..సైన్స్ ఎరగని నిజలా అనేది ప్రశ్నార్థకమే.! పాజిటివి ఎనర్జీకీ నెగటివ్ ఎనర్జీకీ మధ్య కనిపించని కొన్ని శక్తులే..ఆధారాలు లేని నిజాలు. అలాంటి కొన్నింటిని ఈరోజు చూద్దాం..!
మీకు ఎవరైనా పదునైన వస్తువులు గిఫ్టుగా ఇస్తే… వారికి ఏదైనా నాణేన్ని తిరిగి ఇవ్వాలట. లేదంటే సంబంధాలు చెడిపోతాయట.
జపనీస్ ప్రకారం తలను ఉత్తరంవైపు ఉంచి నిద్రపోకూడదట. అటువైపు చనిపోయిన వారు విశ్రాంతి తీసుకుంటారని,. అటు తల ఉంచి నిద్రపోతే, దురదృష్టం తప్పదని వీరు నమ్ముతారు..
కత్తెరతో ఆటలాడొద్దన్నది ఈజిప్ట్ ప్రజల మాట. ఆడితే దురదృష్టం తప్పదట.
రష్యాలో అడ్వాన్స్‌గా హ్యాపీ బర్త్‌డే చెప్పరు. అలా చెబితే బర్త్ డే రోజున చెడు జరుగుతుందని వారి నమ్మకమట.
ఆఫ్రికన్ల తలను పశ్చిమంవైపు ఉంచి నిద్రపోకూడదంటారు. వారికి కూడా జపనీయుల తరహాలోనే నమ్మకం ఉంది.
అద్దాలను ఒకదానికి ఎదురుగా మరొకటి ఏర్పాటు చేయకూడదని మెక్సికోలో భావిస్తారు. అలా చేస్తే… దెయ్యాలను డైరెక్టుగా అహ్వానించినట్లేనట.
చాప్‌స్టిక్ (Chopstick) లను ఆహారంలో ఉంచినప్పుడు అంటించకూడదని జపనీయులు నమ్ముతారు. అలా అంటిస్తే, చెడు జరుగుతుందట.
జర్మనీ ప్రజల ప్రకారం… నీటితో ఉన్న గ్లాసులతో చీర్స్ ఇవ్వకూడదు. అలా ఇస్తే.. అవతలి వ్యక్తి చనిపోవాలని కోరుకున్నట్లు అవుతుందట.
ఫిలిప్పీన్స్ ప్రజల ప్రకారం శ్మశానానికి వెళ్లాక.. తిన్నగా ఇంటికి వెళ్లకూడదు. రెస్టారెంట్ దగ్గరో, షాపు దగ్గరో ఆగి వెళ్లాలట. లేదంటే దెయ్యాలు వెంటే వస్తాయని వారి నమ్మకం.
ఇంట్లో ఈల (Whistle) వెయ్యొద్దని లిథువేనియన్లు నమ్ముతారు. విజిల్ వేస్తే… పిశాచాలను పిలిచినట్లే అని వారి ఉద్దేశం.
బ్రిటన్‌లో టేబుల్‌పై షూస్ ఉంచరు. అలా ఉంచితే… ఆ ఇంట్లో ఆ షూస్ వాడే వ్యక్తి చనిపోయినట్లు లెక్క. ఈ మూఢనమ్మకాన్ని ఇప్పుడు పెద్దగా నమ్మట్లేదు.
మనిషిపై పక్షి రెట్ట వేస్తే.. వారికి అదృష్టం అని రష్యన్లు నమ్ముతారు. సంపద బాగా వస్తుందట. భలే ఉంది ఇది..!
ఇటలీ ప్రజల ప్రకారం ఇంట్లో గుడ్లగూబ ఉంటే… ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారట.
ఈజిఫ్ట్ ప్రజల గుడ్లగూబను డైరెక్టుగా చూసినా, దాని అరుపు విన్నా.. త్వరలోనే ఓ భయంకరమైన వార్తను వింటారని నమ్ముతారు. అందుకే వాళ్లు రాత్రిళ్లు అడవికి వెళ్లరట.
ఇంటి బయట కూర్చొని బట్టలు అల్లుకుంటూ ఉంటే… శీతాకాలం మరింత ఎక్కువకాలం కొనసాగుతుందని ఐస్‌లాండ్‌లో నమ్ముతారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది.!
-Triveni Buskarowthu