బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఆహారంలో మార్పులు, అలవాట్లలో మార్పులు చేస్తూ బరువు తగ్గడానికి చాలానే కష్టపడి ఉంటారు. అంత చేసినా బరువు పెరుగుతున్నారని మీకు అనిపిస్తుందా? తినే ఆహారం నుండి చేసే పనుల వరకు అన్నీ మార్చినా బరువు పెరుగుతున్నామన్న భావన మీలో ఉంటే మీరో తప్పు చేస్తున్నారని గుర్తించాలి. ఆ తప్పే అసలు సమస్యని పసిగట్టలేకపోవడం. అన్నీచేస్తున్నారు సరే, సరిగ్గా నిద్రపోతున్నారా? కావాల్సినంత నిద్ర మీకు దొరుకుతుందా? దీనికి సమాధానం మీ దగ్గర లేకపోతే మీరు బరువు పెరగడానికి కారణం ఇదే అయ్యుంటుంది.
అవును, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. కావాల్సినంత మీకు దొరక్కపోతే బరువు పెరగడం మొదలవుతుంది. అసలిలా బరువు పెరగడానికి కారణాలేంటో చూద్దాం.
ఆకలి ఎక్కువ అవుతుంది
నిద్ర సరిగ్గా లేకపోతే ఆకలి పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ తింటారు. అలా శరీరానికి కేలరీలు ఎక్కువగా చేరతాయి. కేలరీలు ఎక్కువైతే శరీరం బరువు పెరుగుతుంది. కావాల్సినంత నిద్ర దొరక్కపోతే, (అంటే కనీసం రోజుకి 7నుండి 8గంటలు) శరీరంలో ఆకలిని ప్రేరేపించే నాన్ లీనియర్, లెప్టిన్ పరిమాణాలు పెరుగుతాయి. దానివల్ల ఆకలి ఎక్కువ అవుతుంది.
జీవక్రియ రేటు తగ్గుతుంది
నిద్ర లేకపోవడం వల్ల కేలరీలు ఎక్కువ తీసుకుంటారని ముందే చెప్పుకున్నాం. దానికి కారణం ఏమిటంటే, నిద్రలేకపోతే జంక్ ఫుడ్ తినాలని చూస్తారు. ఆ కారణంగా కేలరీలు పెరుగుతాయి. అంతేకాదు దానివల్ల జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది.
బరువు పెరుగుదల
రోజులో 385కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల 500గ్రాముల బరువు పెరుగుతారు. ఇది కాకుండా, టైప్ -2 డయాబెటిస్, రక్తపోటు మరియు హృదయ సంబంధ వ్యాధులు కూడా వస్తాయి. మీరు బరువు తగ్గాలంటే, తగినంత నిద్ర పోవాలి. అంతేకాదు, సరైన సమయానికి నిద్రపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, నిద్రపోవడానికి 2గంటల ముందు ఆహారం తినాలి. ఇవన్నీ చేస్తూ సరైన నిద్ర ఉంటే మీరు బరువు తగ్గుతారు.