కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగుల పెన్షన్ కేవలం ₹200 మాత్రమే అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. దివ్యాంగుల కృతజ్ఞత సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌ఘడ్‌లో దివ్యాంగుల పెన్షన్ కేవలం ₹200 మాత్రమేనన్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌లో అసలు అంగవైకల్యాన్ని గుర్తించడం కూడా లేరని వెల్లడించారు.
అంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో కేవలం 47,000 మంది దివ్యాంగులే ఉన్నారు.. వారికి ఇచ్చే పెన్షన్ కేవలం ₹600-₹1,000 అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దివ్యాంగుల పెన్షన్ ₹1,100 మాత్రమేనని… అదే తెలంగాణలో 5.70 లక్షల మంది దివ్యాంగులకు ₹4,016 పెన్షన్ అందుతుందని వివరించారు కేటీఆర్. గత తొమ్మిదిన్నర ఏళ్లల్లో దివ్యాంగుల పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ₹10,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దివ్యాంగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాల గురించి దివ్యాంగుల కృతజ్ఞత సభలో వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.