షాజీరా కషాయం తాగితే..స్త్రీలల్లో ఉండే ఆ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయ్..జుట్టు కూడా రాలదట..!

-

వయసులో ఉన్న ఆడవారిలో ఇస్ట్రోజన్ హార్మోన్ ప్రొడెక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. శరీరంలో ఉన్న అనేక హార్మోన్ల ఉత్పత్తి తగ్గడానికి కారణం ఏంటంటే..ధైరాయిడ్, ఇన్సులిన్, ఓవరీస్ నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ, ముఖ్యంగా జీవన శైలిలో వచ్చిన మార్పులు..ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సైజు పెరుగుతుంది.

లోపల చూస్తే హార్మోన్స్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గటం వల్ల పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా రావడం, సంతానం కలగకపోవటం, మంచిగా ఫోలికల్ రిలీజ్ అవకపోవడం, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం,చాలా బలహీనంగా అయిపోవం, ఓవరీస్ లో బుడగలు రావడం ఇలా అనేక రకాల సంబంధమైన సమస్యలతో స్త్రీలు బాధపడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి చికిత్స చేసుకుంటారు. కానీ వీటివల్ల అనేక సమస్యలు వస్తాయి. నాచురల్ గా ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటే షాజీరా కషాయం అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ ను 30రోజుల్లోనే పెంచుతుంది. మెడిసిన్స్ వాడకుండా అద్భతంగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించటం జరిగింది.

మనందరం బిర్యానీలు, కుర్మానులు చేసినప్పుడు షాజీరా వాడుతుంటారు. జీలకర్రలానే కనిపిస్తుంది. ఈ షాజీరా కషాయం కనుక తీసుకుంటే..ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుందని 2009వ సంవత్సరంలో సాగర్ ఫార్మసుటికల్ మధ్యప్రదేశ్( Sagar Pharamaceuticals- Madhya Pradesh) పరిశోధన చేసి కనుగొన్నారు. ఇది ఎలా పనికొస్తుంది, ఎంతమోతాదులో వాడాలో చూద్దాం.

చాలా కరెక్టు కొలతలు వాడాలట. ఒక కేజీ బరువుకి 150మిల్లీ గ్రాములు షాజీరా తీసుకోవాలి. ఇండియాలో స్త్రీలో యావర్రేజ్ గా ఉండాల్సిన బరువు 53-55 ఉండాలి. 55-60కేజీల బరువు ఉండే స్త్రీలకు సుమారుగా 7-8 గ్రాములు అవసరం. 65-70 కేజీల మధ్యలో బరువు ఉండేవారు 9-10 గ్రాములు షాజీరా వాడితే సరిపోతుంది.

దీన్ని ఎలా వాడాలి అంటే..

ఇప్పుడు చెప్పిన కొలతలు తీసుకుని..నీళ్లలో వేసుకుని మరిగించాలి. మరిగిన తరువాత ఆ కషాయాన్ని తీసుకుని తేనె, నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు.

ఈ కషాయం తాగటం వల్ల వచ్చే మార్పులు

ఈస్ట్రోజన్ హార్మోన్ 30రోజుల్లో పెరిగి..ఎగ్ ఫోలికల్స్ మంచిగా రిలీజ్ అవుతుంది.
గర్భదారణ సులభం చేయడానికి ఇది చాలా మంచి అవకాశాన్ని కలిగిస్తుంది.
ఎవరైతే ఈ షాజీరా కషయాన్ని మోతాదుకు మించి ఎక్కువ వాడతారో గర్భం రాకపోవచ్చు, గర్భం పోవచ్చు అని కూడా నిరూపించబడిందట..ఎందుకంటే..ఈ ఎగ్ రిలీజ్ అవడానికి రెండు రోజుల ముందు ఈస్ట్రోజన్ కాస్త తగ్గాలి..మీరు ఈ కషాయం ఎక్కువ తాగటం వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అప్పుడు పిరియడ్ కు రెండు రోజుల ముందు ఈస్ట్రోజన్ తగ్గి LHహార్మోన్ అనేది బయటకు రావాలి. కానీ ఎక్కువ వాడేవారిలో..ఈస్ట్రోజన్ తగ్గకపోవడం వల్ల ఈ హార్మోన్ బయటకు రాకుండా ఉంటుంది.
అందుకే బరువుకు తగ్గటటుగా..కరెక్టుగా చూసుకుని వాడుకుంటే మంచిది.
ఈ షాజీరా కషాయం వల్ల యూట్రస్ బరువు పెరగటం వల్ల ఎండోమెట్రియం ప్రోపర్ గా జరుగుతుందట. అది గర్భం దాల్చడానికి బాగా ఉపయోగపడుుతంది.

ఇది 100 గ్రాములు తీసుకుంటే..60-70 రూపాయలు ఉంటుంది. ఈరోజుల్లో చాలా మందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వారంతా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు, టాబ్లెట్స్ వాడి ఉంటారు. ఆఖరి అవకాశంగా..ఒక నెల రోజులు ఇది ట్రై చేసి చూడండి. గుర్తుపెట్టుకోండి..బరువుకు తగ్గట్టే వాడాలి.

-Triveni Buksarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version