భార్య పుట్టినరోజు మర్చిపోతే ఐదేళ్లు జైలు శిక్ష..!రూమర్‌ కాదు రూల్‌ అండీ.!

-

పెళ్లైన తర్వాత పెళ్లిరోజు, పార్ట్నర్‌ పుట్టినరోజు చాలా స్పెషల్‌.. ఎక్కువగా ఈ డేట్స్‌ను అమ్మాయిలే గుర్తుపెట్టుకుంటారు. అబ్బాయిలు ఎప్పుడూ మర్చిపోతుంటారు. అంటే వారికి ఉండే టెన్షన్స్‌, హడావిడి వల్ల అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. డేట్స్‌ మర్చిపోయినంత మాత్రనా ప్రేమ లేదని కాదు కదా..! కానీ గుర్తుపెట్టుకోని విష్‌ చేస్తే.. మీ పార్ట్‌నర్ చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతారు అది వేరే విషయం.. అయితే భార్య పుట్టినరోజు మర్చిపోవడం మాత్రం అక్కడ నేరం.. శిక్ష ఏదేళ్లట..! వామ్మో అనుకుంటున్నారా..? ఇంతకీ ఈ వింత చట్టం ఎక్కడ అమలులో ఉందంటే..
భార్య పుట్టినరోజును మరచిపోవడం నేరమని తెలిపే ఒక దేశం ఉందటే అస్సలు నమ్మశక్యంగా లేదు కదా.. ఈ విచిత్ర చట్టం ఉంది సమోవా అనే ద్వీప దేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీప దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ భర్త తన భార్య పుట్టినరోజును అనుకోకుండా మరచిపోతే అది పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. భర్త తన భార్య పుట్టినరోజును మొదటిసారి మరచిపోతే, అతనికి వార్నింగ్ ఇస్తారు.. మరోసారి కూడా అదే తప్పు చేస్తే జరిమానా లేదా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. భార్య ఫిర్యాదు చేస్తే భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష కూడా వేస్తారట.
సమోవా ఒక్కటే కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి విచిత్రమైన చట్టాలు నేటికీ అమల్లో ఉన్నాయి. ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ ధరించి బయటకు వెళితే, అది చట్టవిరుద్ధం.. తూర్పు ఆఫ్రికాలో జాగింగ్ నిషేధం.. జర్మనీలో హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆయిల్ అయిపోయినప్పుడు మీరు వాహనాన్ని రోడ్డుపై వదిలేస్తే మీకు జైలు శిక్ష విధించబడుతుంది.
ఈ క్రేజీ చట్టాలు మన దగ్గర లేవు సంతోషం.. అయినా భార్య పుట్టినరోజుకు ఆ దేశంలో అంత వ్యాల్యూ ఇచ్చారు చూడండి అది హైలెట్‌.. మరి భార్య భర్త పుట్టినరోజుకు మర్చిపోతే కూడా ఇదే రూల్స్‌ ఉన్నాయా అంటే.. సప్పుడు లేదు..! ఈ విషయంలో పాపం అబ్బాయిలకే అన్యాయం జరుగుతుంది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version