జ్వరం వస్తే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పారిపోయే నీకు రాజకీయాలెందుకు? : వైసీపీ శ్రేణులు

-

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, ప్రచారంలో శ్రేణులకు జాగ్రత్తలపై జనసేన కీలక ప్రకటన చేసింది. ‘రికరెంట్ ఇన్ఫ్లూయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి పవన్ నిత్యం ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దు అని కోరారు.షేక్యోండ్స్, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖంపై పడకుండా చూడండి’ అని విజ్ఞప్తి చేశారు.

ఇక దీనిపై వైసీపీ ఎక్స్(ట్విట్టర్) లో స్పందిస్తూ….వచ్చాడండి ఫ్లవర్ స్టార్ పవన్ కళ్యాణ్.నాలుగురోజులు ఎండలో తిరిగితే జొరం వస్తుంది.. అభిమానులు పూలు వేస్తే ఎలర్జీ వస్తుంది. అలాంటి మీరు ఎండనక వాననకా ప్రజల్లో తిరిగే ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి మీద జరిగిన దాడిని గులకరాయి అని హేళన చేస్తావా? అని మండిపడింది. రెండ్రోజులు ప్రజల్లో ఉండలేని నీకు… జొరం వస్తే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పారిపోయే నీకు రాజకీయాలెందుకు? పోయి రిసార్టులో రెస్ట్ తీసుకో! జనసేన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మీ బాధ తప్పుతుంది! అని ఎద్దేవ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version