ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని సర్వేలన్నీ తేల్చేశాయి.లోకల్ తో పాటు జాతీయ మీడియా సంస్థలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసేసాయి.ఈసారి కూడా ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇవ్వనున్నారని మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అందరూ చెప్పేస్తున్నారు.ఆఖరికి తెలుగుదేశం పార్టీ కుడా దీనినే అంగీకరిస్తోంది.147 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉందని తేల్చేశారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ గ్రాఫ్ పెరగకపోవడంతో ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి.బంపర్ మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం సీఎం అమలు చేశారు. దాదాపు 99 శాతం హామీలను అమలు చేసి మళ్లీ 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు. హామీలను నిలబెట్టుకున్న సీఎం జగన్ కి ఏపీ ప్రజలు జై కొడుతున్నారు. ఇటీవల సీఎం చేపట్టిన బస్ యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. రోజురోజుకీ వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది.దీంతో ఇటీవల చేపట్టిన సర్వేల్లోనూ వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.140 సీట్లకుపైగా గెలుచుకుని మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని సర్వేలు తేల్చాయి.ఇప్పుడు ఈ విషయాన్ని టీడీపీ సైతం ఒప్పేసుకుంది.ఎంతగా ప్రయత్నించినా ఇంకా 2శాతం ఓట్ల దూరంలో ఉన్నారని పలువురు విశ్లేషకులు చెప్పేశారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన,భారతీయ జనతా పార్టీలు జతకట్టాయి.దేశమంతా మోడీ గాలి వీస్తున్నా ఏపీలో మాత్రం ఫ్యాన్ గాలి దూకుడుగా ఉంది. ఇక్కడ మోదీ మేనియా పనిచేయడం లేదని సర్వేలు తేల్చేశాయి.టీడీపీ విశ్లేషకుల అంచనాల ప్రకారం 147 స్థానాల్లో వైసీపీ గెలవబోతోందని క్లారిటీ ఇచ్చారు. కేవలం 28 నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉందని స్పష్టం చేసేశారు.టీడీపీ రాష్ట్ర ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఈ విషయంపై నిర్మొహమాటంగా చెప్పేశారు. 10 లక్షల ఓట్లతో వైసీపీ ముందంజలో ఉందని,టీడీపీకి ఈసారి కూడా కష్టమేనని చెప్పారు.దీంతో చేసేదేమీ ల్3క టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు.