రాముడిలో వుండే ఈ లక్షలను అలవాటు చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చుట..!

-

రాముడు గురించి మన పూర్వికులు ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు అదీ కాక పుస్తకాలు ద్వారా కూడా మనం రాముడు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. రాముడు అంత నీతిమంతుడు, నిజాయితీపరుడు ఎవరు ఉండరు. పైగా శ్రీరాముడు గొప్ప నాయకుడు కూడా.

 

నిజానికి మనం చాలా విషయాలను త్యాగమూర్తి అయిన రాముడు దగ్గర్నుంచి నేర్చుకోవచ్చు. సత్యానికీ ప్రతీకగా శ్రీరాముడు నిలిచారు అంతేకాక ఆదర్శ పుత్రుడిగా.. గొప్ప భర్తగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అయితే రాముడు నుండి మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

దయాగుణం:

రాముడు నుంచి మనం దయాగుణం నేర్చుకోవచ్చు. జాలీ దయా స్వభావాలను శ్రీరాముడు కలిగి ఉండేవారు. ఎంతో దయగా ఉండేవారు రాముడు.

స్నేహ గుణం:

శ్రీ రాముడు ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా ఉండేవారు. సుగ్రీవుడిని విభీషణుడిని కూడా రాముడు సాదరంగా స్వాగతం పలికారు.

ఆశించకూడదు:

ఎవరి దగ్గర నుండి కూడా మనం ఏది ఆశించకూడదు అని రాముడు చెప్పారు. ఈ అలవాటును కూడా మనం రాముడు దగ్గరి నుండి చూసి అలవాటు చేసుకుంటే మంచిది. ఎప్పుడు రాముడు ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించలేదు. అసభ్యంగా ఉండలేదు. ఎప్పుడు ఎవరి నుండి ఏమీ ఆశించలేదు.

సత్యమే మాట్లాడాలి:

శ్రీరాముడు నుండి సత్యాన్ని మాట్లాడాలి అని మనం నేర్చుకోవచ్చు చాలామంది ప్రతిరోజూ ఎన్నో అబద్ధాలని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాలు మాట్లాడాలి అని మనం రాముడు దగ్గర్నుంచి తెలుసుకోవచ్చు. నిజానికి ఇటువంటి వాటిని మనం అలవాటు చేసుకుంటే జీవితంలో సక్సెస్ ని పొందడానికి అవుతాయి కాబట్టి కచ్చితంగా ఈ గుణాలని అలవాటు చేసుకుని మీ భవిష్యత్తుని మరింత అందంగా తీర్చిదిద్ది.. ఉన్నత శిఖరాలను చేరుకొంది.

Read more RELATED
Recommended to you

Latest news