ఇంట్లో గుర్రాల పెయింటింగ్‌ను ఈ దిశలో వేలాడదీస్తే అప్పుల బాధ ఉండదట..!

-

ఆర్థిక సమస్యలు ఈరోజుల్లో చాలామందికి ఉంటాయి.. చేసే కష్టం చేస్తూనే ఉన్నా.. డబ్బు మాత్రం నిలవడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు.. ఇలా జరుగుతుంది అంటే.. మీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందని అర్థంచేసుకోవాలి. వాస్తుతో అంత ఈజీకాదు.. ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే ఇలాంటివ జరుగుతాయి..

 

 

మ‌న ఇంట్లో కొన్ని ర‌కాల వ‌స్తువుల వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్లే కొన్నింటి వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. అలాంటి వాటిల్లో గుర్ర‌పు బొమ్మ‌లు, వాటి పెయింటింగ్‌లు ఒక‌టి. గుర్రాలు శ‌క్తికి, వేగానికి ప్ర‌తి రూపాలని మనం నమ్ముతాం. సూర్యుడు అనంత కోటి జీవ‌రాశికి శ‌క్తి, వెలుగు ప్రదాత‌. ఆయ‌న ర‌థాన్ని గుర్రాలు లాగుతుంటాయి. అలాంటి గుర్రాల‌కు చెందిన పెయింటింగ్‌లు లేదా బొమ్మ‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే మ‌న‌కు సూర్యుడి లాగే గుర్రాల నుంచి కూడా పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

ఇంట్లో ఉత్త‌రం లేదా వాయువ్య దిశ‌లో గుర్రాలు ఉన్న పెయింటింగ్‌ను వేలాడ‌దీయాలి. ఆ పెయింటింగ్‌లో తెల్ల గుర్రాలు మాత్రమే ఉండాలి. అవి ప‌రుగు తీస్తున్న‌ట్లు ఉండాలి. అలాగే వాటి సంఖ్య 5గా ఉండాలి. ఇలాంటి పెయింటింగ్‌నే ఆ దిశ‌లో వేలాడ‌దీయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషం పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌వ‌చ్చు. ముఖ్యంగా అప్పులు తొల‌గిపోతాయి. డ‌బ్బు వృథాగా పోదు. ధ‌నం బాగా సంపాదిస్తారు.

ఇక దంప‌తులు త‌మ ఇంట్లో బెడ్‌రూమ్‌లో కిటికీ లేదా ఏదైనా షెల్ఫ్‌లో లేదా బెడ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే టేబుల్ మీద రెండు గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్టుకోవాలి.. వాటిని ఎదురెదురుగా పెట్టాలి. దీంతో ఇంట్లో దంప‌తుల మ‌ధ్య ఉండే క‌ల‌హాలు పోతాయి. వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. ఎలాంటి మ‌నస్ఫ‌ర్థ‌లు రావు.

ఈ చిన్నపాటి టిప్‌ వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. వాస్తు గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా పెద్ద కాన్స్‌ప్ట్.. ఇంట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూకడదు, ఉండేవి ఏ దిక్కులో ఉండాలి ఇవన్నీ చాలా ముఖ్యం.. ఇంట్లో ఎప్పుడు విరిగిపోయిన వస్తువులను పెట్టుకోకూడదు. ముఖ్యంగా విరిగిన గడియారం, అద్దం లాంటివి. పాడైపోయిన షూస్‌ కూడా ఇంట్లో ఉండటం మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version