కొలెస్ట్రాల్ కేవలం లావుగా ఉన్నవాళ్లకే వస్తుంది అనుకోవడం మీ పొరపాటు. కొలెస్ట్రాల్‌కు లావు, సన్నంతో పనిలేదు.. మీరు తినే ఫుడ్ వల్లనే మీకు కొలెస్ట్రాల్ వస్తుంది. జీవనశైలి ఎలా ఉంది, శారీరక శ్రమ ఉందా లేదా..? ఎలాంటి ఆహారం ఎక్కువగా తింటున్నారు.. వీటన్నింటి మీద కొలెస్ట్రాల్ ఆధారపడుతుంది. ప్రతి వ్యక్తి కనీసం ఏడాదిలో ఒక్కసారైన కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు.
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ (HDL) మరియు మరొకటి చెడు కొలెస్ట్రాల్ (LDL). ఎవరికైనా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, మందులు వేసుకునే బదులు, ఈ పండ్లను తొక్కతో కలిపి తినాలి. ఈ పండ్ల తొక్కలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పియర్ ఫ్రూట్స్
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి పియర్ పండు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల అవసరమైన పోషకాలు దీని పై తొక్కలో ఉంటాయి. రోజూ మీ ఆహారంలో ఈ వాటర్ యాపిల్‌ను చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
సపోటా
చాలా మంది సపోటా తినడానికి ఇష్టపడరు. కానీ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. సపోటా ఎంత ఆరోగ్యకరమో దాని పొట్టు కూడా అంతే ఆరోగ్యకరం. సపోటా తొక్కలో ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
ఆపిల్:
సాధారణంగా కొందరు యాపిల్ పండును తొక్క తీసి తింటారు. కానీ యాపిల్ తొక్కలో విటమిన్ ఎ, సి మరియు కె కూడా పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
కీవీ పండు:
కివీ పండు తొక్క మరింత ఆరోగ్యకరమైనది. కానీ చాలా మంది కివీ పండును పొట్టు తీసిన తర్వాత తింటారు. కానీ యాంటీ ఆక్సిడెంట్లు దాని తొక్కలో కనిపిస్తాయి. ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ప్రతిరోజూ కివీ పండును తొక్కతో తినాలి. వీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటూ.. వంటలో ఉప్పు, నూనెలను తగిస్తే.. కొన్ని నెలల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.