ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంది..పొదుపు చేసుకొనెందుకు వీలుగా ఉండేలా ఎన్నో పథకాలను అందించనున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు ఎప్పుడో ఒకసారి ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే.అప్పుడు వారికి ఆదాయం ఉండదు. ఆ సమయంలో నెలవారీ ఆదాయం ఉండదు. అందుకే అప్పటి ఖర్చుల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. లేదంటే అప్పుడు ఎవరో ఒకరి మీదా ఆధారపడవలసి వస్తుంది. ఇందుకోసం మీకు అటల్ పెన్షన్ యోజన బాగా ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన జీవితాన్ని కోరుకునే వారు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు..ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెలా 5 వేల రూపాయల పెన్షన్ పొందుతారు.
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో చేరవచ్చు. మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం చందాదారుల సంఖ్య 4.01 కోట్లకు పెరిగింది. ఈ పథకాన్ని 2015లో ప్రభుత్వం ప్రారంభించింది. 2018-19లో 70 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఈ స్కీమ్‌కి కనెక్ట్ అయ్యారు. తర్వాత 2020-21లో 79 లక్షల మంది ఈ పథకంలో చేరారు. ఇప్పుడు 2021-22లో ఈ పథకంలో చేరిన వారి సంఖ్య కోటి దాటింది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ ప్రకారం..గత ఏడాది నుంచి ఇప్పటివరకు 40 మిలియన్ల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఈ పథకంలో దాదాపు 1 కోటి మంది తమ ఖాతాలను తెరిచారు. ఈ పథకంలో 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. మీ పెట్టుబడి మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అటల్ పెన్షన్ పథకంలో నెలవారీ కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందుతారు. మీరు ఈ పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే మీకు అంత మంచి రాబడి ఉంటుంది.