జబర్దస్త్ వినోద్ కష్టాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది బుల్లితెర పైన కమెడియన్లుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిలో జబర్దస్త్ వినోద్ కూడా ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్ లో అదరగొట్టేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. జబర్దస్త్ వినోద్ అతని భార్య మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జబర్దస్త్ వినోద్ మాట్లాడుతూ.. పలు అనారోగ్య సమస్యల కారణంగా తను చాలా వీక్ అయ్యానని అందుకోసమే చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నానని తెలియజేశారు. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో వాటర్ ఫామ్ అవ్వడం వల్ల ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను అని తెలిపారు వినోద్. ఈ సమస్య వచ్చిన సమయంలో నడవడం కూడా చాలా కష్టమైందని తెలిపారు. కేవలం తమ ఫ్యామిలీ సపోర్ట్ ద్వారానే ఇలా ఉండగలిగాను అని తెలియజేస్తున్నారు వినోద్. అయితే షూటింగ్లకు లేట్ అవుతుందని ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల.. జంక్ ఫుడ్ తినడం వల్ల.. ఇతర కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్య వచ్చిందని తెలియజేస్తున్నారు.

వినోద్ భార్య మాట్లాడుతూ.. తన భర్తకి ఇలా లంగ్ ఇన్ఫెక్షన్స్ సోకిందని తెలియగానే చాలా బాధపడ్డానని తెలియజేస్తోంది. వినోద్ కు ఇలాంటి ఆరోగ్య సమస్య రాగానే వెంటనే కుటుంబ సభ్యులు రియాక్ట్ అయి పలు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకున్నారని తెలియజేశారు . దీంతో ఎక్కువగా హెయిర్ లాస్ అయిందని కూడా వినోద్ భార్య తెలియజేయడం జరిగింది. ఇలా చావు అంచుల మేరకు వెళ్లి వచ్చి ఆ సమస్య నుంచి కోలుకున్నారని తెలియజేస్తున్నారు జబర్దస్త్ వినోద్ భార్య.. ప్రస్తుతం వినోద్ , తన భార్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version