రాజ్మా గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

రాజ్మా గింజలను కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. మన శరీరంలోని కిడ్నీల ఆకారాన్ని పోలి ఉండటం వలన వీటిని కిడ్నీ బీన్స్ గా పిలుస్తుంటారు. వీటిని అందరు ఇష్టంగా తింటూంటారు. ఈ గింజల్లో విటమిన్ ఇ, కె మరియు కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పోటాషియం వంటి ఖానిజాలతో పాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి.ఈ రాజ్మా గింజలు నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో లభిస్తుంది. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధి గ్రస్తుల పాలిట రాజ్మా ఒక వరంగా చెప్పవచ్చు.ఇది శరీరంలో షుగర్ లెవల్స్ ని క్రమబద్దీకరిస్తుంది. అంతేకాకుండా చక్కెరవ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు రాజ్మా ని డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

కిడ్నీ బీన్స్ ఎక్కువ శాతం లో ప్రోటీన్లను, ఫైబర్ ను మరియు తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది.ఇందులో ఉండే మెగ్నీషియం, గుండె జబ్బులు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కిడ్నీ బీన్స్ అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలను కలిగి ఉంది.ఇది మన శరీరాన్ని అనేక ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. అలాగే మన శరీరానికి హాని చేసే టాక్సీన్ లను, మలినాలను శరీరం బయటికి విసర్జించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డైట్ అని చెప్పవచ్చు. ఇందులో సమృద్ధిగా ఉండే ఫైబర్ శరీరంలో మెటబాలిజం రేటును పెంచి జీర్ణ క్రియలను మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను కూడా తగ్గించి ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది.

రాజ్మాను పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్స్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇది అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంది. ఇది మాంసాహారం మరియు ఇతర ఆహార పదార్థాల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందువలన శాఖాహారులకు ఇది చక్కని ఎంపిక అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version