చెవిలో ఇయర్‌ బడ్‌తో తిప్పుతుంటే భావప్రాప్తి కలుగుతుందట..! ఇదొక అరుదైన రోగం.!

-

కాటన్ బడ్‌తో చెవి లోపల పెట్టి తిప్పుకోవడం చాలా మంది అలవాటు. ఏదైనా డస్ట్‌ ఉన్నప్పుడు తిప్పే వాళ్లు కొందరైతే.. అదేపనిగా ఖాళీగా ఉంటే చాలు.. కాటన్‌ బడ్‌ పెట్టి చెవిలో మజ్జిగ చేసప్పుడు కవ్వంతో తప్పినట్లు తిప్పేసుకుంటారు. ఓరిబాబు అలా తిప్పుకుంటే గూబలు పాడవుతాయరా అన్నా వినరు. ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్‌ అండ్‌ క్రేజీ విషయం ఏంటంటే.. చెవిలో కాటన్‌ బడ్‌ పెట్టి తిప్పుకోవడం వల్ల భావప్రాప్తి పొందుతారట. కదా.. మీకు కూడా సమ్మగా అనిపిస్తుంది. గమనించారా..?

చెవిలో ఇయర్ బడ్స్‌తో తిప్పుతుంటే లైంగికంగా ప్రేరణ కలిగి భావప్రాక్తికి గురవ్వుతారట. ఇయర్ గాస్మ్(Ear + orgasm = Eargasm) అంటారు. స్పర్శకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేసే వాగస్ నాడి చెవిలోపలకు విస్తరించిందట. చెవిలోపల ఏదైనా వస్తువు తాకినపుడు వాగసనాడిని ప్రేరేపించవచ్చు. అదే హాయిగొలిపించే ‘హ్యాపీ బటన్’. కానీ, అది హ్యాపీ బటన్ కాదు.. ఒక లోపం. ఇయర్ గాస్మ్ కలిగిన వారు కాటన్ బడ్స్‌ను అస్సలు ఉపయోగించకూడదు.

చెవిలో కాటన్ బడ్ పెట్టినపుడు దగ్గువచ్చే వారిలో గొంతులో ఏదో ఉందన్న సమాచారం మెదడుకు చేరడం వల్ల దగ్గు వచ్చేస్తుంది. అలాగే గొంతులో ఏదైనా అడ్డు పడినపుడు చెవిలో మంట కూడా రావచ్చు. కొంత మందిలో మాత్రం ఇయర్ గాస్మ్ వస్తుంది. ఇలా ఇయర్ గాస్మ్ వచ్చే వారిలో వాగస నాడిని ప్రేరేపించడం వల్ల అనుభవించే ఇతర ఉద్వేగాల మాదిరిగానే పారాసింథటిక్ రియాక్షన్‌తో ప్రశాంతమైన భావన కలుగుతుందట. అందుకే చెవులు చాలా మందిలో ఎరోజెనస్ జోన్లుగా ఉంటాయట.

చెవిలో ఇయర్‌బడ్స్‌తో తిప్పితే అంగస్తంభన?
చెవుల్లో అంగస్తంభనకు సంబంధించిన కణజాలం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అందుకే అక్కడ స్టిమ్యూలేట్ చేసినపుడు అంగస్తంభనలు కలగవచ్చని కూడా వైద్యులు చెబుతున్నారు. చెవిలో ఆహ్లదకర భావన కలిగించేవి కాటన్ బడ్స్ మాత్రమే కాదు, స్పర్శ ఏదైనా కూడా ప్రేరేపణ కలిగించవచ్చు. ఒక్కోసారి మ్యూజిక్, చిన్నగా పాడడం కూడా ఇలాంటి హాయినే కలిగిస్తుందట. అదే భావప్రాక్తికి కారణం అవుతుంది.

ఇయర్ గాస్మ్ ను ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటే మాత్రం తక్కువ హానికలిగించే పద్ధతులను అనుసరించడం మంచిది. ఊరికే చెవిలో పుల్ల తిప్పడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చెవిలోని వాక్స్‌ను బయటకు తియ్యడానికి బదులు మరింత లోపలికి తొసెయ్యవచ్చు, కర్ణభేరికి నష్టం కలిగించవచ్చు. ఫలితంగా అకస్మాత్తుగా వినికిడి లోపం రావచ్చు లేదా చెవిలో నొప్పి రావచ్చు. నిజానికి చెవులు ప్రత్యేకంగా శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదట. అవి సహజంగానే శుభ్రం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version