పవన్‌పై వాలంటీర్ పోటీ?ఏంటి కామెడీయా..!

-

ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో కొందరు మహిళలు మిస్ అవ్వడానికి వాలంటీర్లే కారణం అనడంతో పెద్ద రచ్చ నడుస్తుంది. దీంతో వైసీపీ నేతలు, వాలంటీర్లు పవన్ పై విరుచుకుపడుతున్నారు. అటు పవన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. పదే పదే వాలంటీర్లపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

ఇక అందుకు తగ్గట్టే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పై విరుచుకుపడ్డారు.  పవన్ కల్యాణ్ అంటే గాలి కళ్యాణ్ అని, ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తిరగడం దుష్ట చతుష్టయం కుట్ర అని, కాపులను మచ్చిక చేసుకోవడానికే తిరుగుతున్నారని, వలంటరీ వ్యవస్థపై మిస్టర్ గాలి కళ్యాణ్‌నుకున్న అభ్యంతరం ఏంటి? మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పవన్‌ను ఆవహించి ఉందని అంబటి ఫైర్ అయ్యారు.

రెమ్యూనరేషన్ బట్టి పవన్ డైలాగులు, కాల్షీట్లు ఉంటాయని, డబ్బులు సంపాదనకి రాజకీయాల్లోకి వచ్చారని చెల్లుబోయిన అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగా పవన్ లో ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే పొత్తులు లేకుండా బరిలోకి రావాలని, పైగా పవన్ ను ఓడించడానికి తమ నాయకులు ఎవరూ కూడా అవసరం లేదని, తమ వాలంటీర్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తమని, ఈ సవాల్‌ని పవన్ స్వీకరిస్తారా అని జోగి సవాల్ చేశారు.

అయితే రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు ఇలాంటి సవాళ్ళు కామన్. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవు. పవన్ పై వాలంటీర్‌ని పోటీ పెట్టే సాహసం వైసీపీ చేసే ఛాన్స్ లేదు.గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. అలా అని ప్రతిసారి ఓటమే వస్తుంది…వాలంటీర్‌ని పెట్టిన గెలిచేస్తామనేది వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. పైగా ఇప్పుడు ‌పవన్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పవన్ పై వాలంటీర్‌ని పోటీ పెట్టడం పెద్ద కామెడీ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version