‘మహాశక్తి’తో మహిళల ఓట్లకు బాబు గేలం..జగన్‌ని దాటుతారా?

-

రాజకీయాల్లో ఏ పార్టీ అయిన ఓడిపోవాలన్న గెలిచి అధికారం రావాలన్న మహిళల చేతుల్లోనే ఉంటుందని చెప్పాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకే ఏ పార్టీ అయిన మహిళల మద్ధతు పొందడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే 2014లో ఏపీలో చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీతో సహ మహిళలకు పలు హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చారు.

కానీ అధికారంలోకి వచ్చాక బాబు హామీలు విస్మరించారు. ఇక 2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధం..మహిళలకు పలు కీలక పథకాలు హామీలు ఇచ్చి జగన్ హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు అన్నీ హామీలు అమలు చేసి ముందుకెళుతున్నారు. అయితే జగన్ వైపు ఉన్న మహిళా ఓటర్లని టి‌డి‌పి వైపు తిప్పడానికి చంద్రబాబు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించి..అందులో మహిళల కోసం మహాశక్తి అంటూ కొత్త స్కీమ్ తెచ్చారు.

ఇప్పుడు ఆ మహాశక్తిలోని పథకాలని ప్రజలకు చేరువ చేసేలా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే టి‌డి‌పి మహిళా నేతలతో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్రమంతా పర్యటించి..మహాశక్తిలోని కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ మహాశక్తి కార్యక్రమంలో భాగంగా మొదట 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు నెలకు…రూ.1500 ఇవ్వనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ ఎలాగో వస్తుంది.

ఇక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత. జిల్లా పరిధిలో ఎక్కడ ప్రయాణించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అలాగే తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..అంతమందికి ఏడాదికి..రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45 వేలు ఇస్తారు. ఇలా మహిళల ఓట్లని ఆకట్టుకోవడానికి బాబ్ మహాశక్తి అంటున్నారు. మరి ప్రజలు జగన్ ఇస్తున్న పథకాలని కాదని బాబు వైపు వస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version