పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఇలా మాట్లాడితే… ఏడడుగులు పక్కా..!

-

చాలామందికి పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడటం రాదు. దీనివలన ఎన్నో సంబంధాలు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అయితే ఒకవేళ కనుక మీరు ఇష్టపడిన అమ్మాయితో ఏడడుగులు వేయాలనుకుంటే ఇలా మాట్లాడండి. అప్పుడు కచ్చితంగా మీ పెళ్లి అవుతుంది. చేతులారా చెడగొట్టుకోవడం కంటే ఇలా అనుసరించి పెళ్లి చేసుకోవడం మంచిది.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి..?

ఇదివరకులా పెద్దలు పెళ్లిచూపుల్లో మాట్లాడడం లేదు పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్లే మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు మీరు కచ్చితంగా అమ్మాయిని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి.
మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో వారి హాబీస్ గురించి మాట్లాడండి. మొట్టమొదటిసారి మీట్ అయినప్పుడు మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చూసుకోండి.
ఆమె ఇష్టాలని అడిగి తెలుసుకోండి.
మొదటిసారి మాట్లాడేటప్పుడు చాలామంది మాట్లాడలేరు కానీ అలా కాకుండా మీరు కాస్త ముందు అడుగు వేసి మాట్లాడితే కచ్చితంగా ఆ అమ్మాయి గురించి తెలుస్తుంది. ఇంప్రెస్ చేయగలరు.
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలని అనుకుంటోంది కాబట్టి ఆమె కెరీర్ ని మీరు ప్రోత్సహించే విధంగా మాట్లాడండి అప్పుడు కచ్చితంగా అమ్మాయి ఫిదా అవుతుంది.
అలానే పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయితో భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మాట్లాడండి అప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఒక ఇమేజేనేషన్ ని క్రియేట్ చేసుకుంటుంది దీనితో దీంతో ఆమె మీతో జీవించాలని అనుకునే విధంగా ఉంటుంది.
అలానే వాళ్ళ అమ్మానాన్నలతో ఆమె ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనుకుంటుంది అనేది కూడా అడిగి తెలుసుకోండి.
లైఫ్ స్టైల్ గురించి కూడా మాట్లాడండి. ఆమె ఎలా ఉండాలనుకుంటుంది డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేవి కూడా అడిగి తెలుసుకోండి.

ఈ విషయాలను అసలు మాట్లాడకండి:

ఆమె సంపాదన, ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూప్, బాయ్ ఫ్రెండ్స్ వంటి విషయాలని అస్సలు ఆమెతో మాట్లాడకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version