ప్రతి ఒక తల్లిదండ్రులకు కూడా గొప్ప తల్లిదండ్రులు అనిపించుకోవాలి అని ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని మంచిగా చూసుకోవాలని ఉన్నత శిఖరాలని చేరుకోవాలని కన్న కలలు నిజమవ్వాలని ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు తల్లిదండ్రులు. అయితే చాలామంది తల్లిదండ్రులు పెంపకం విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు చేయడం వలన పిల్లల్ని మంచిగా పెంచలేరు. వాళ్ళ భవిష్యత్తులో సమస్యలేమీ లేకుండా చూసుకోవడానికి అవ్వదు.
పిల్లలు కూడా మంచి చెడుని అర్థం చేసుకోలేరు నిజానికి పిల్లలు పైకి రావాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమంగా పెంచాలి. కచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పద్ధతి బాగుండాలి పిల్లల్ని కనే ముందు మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోని కూడా ముందు విశ్లేషించుకోండి. మీరు కూర్చునే విధానం నిలబడే తీరు ఇటువంటివన్నీ కూడా పిల్లల ప్రవర్తన పై ప్రభావం చూపుతాయి కాబట్టి పిల్లల్ని కనే ముందు తల్లిదండ్రులు ఈ విషయాల గురించి గమనించాలి.
పిల్లలు పుట్టాక వాళ్ళకి సరైన వాతావరణం కల్పించాలి ప్రేమపూర్తమైన అనుకూలమైన ఉత్సాహపూర్తమైన వాతావరణం పిల్లలకి ఇవ్వాలి తల్లిదండ్రులు. అప్పుడే పిల్లలు బాగుంటారు అలానే నిజాయితీ నైతిక విలువలతో కూడిన సమగ్రత పూర్ణ వాతావరణంలో పిల్లలకి అందించాలి. అలా కల్పిస్తేనే పిల్లలు బాగుంటారు పైకి రాగలుగుతారు. అలానే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి మీరు పిల్లల్ని కనే ముందు కచ్చితంగా ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి.
వారితో గడిపే ఐదు నిమిషాలైనా ఐదు రోజుల తో సమానం ఇష్టపడి పిల్లల్ని చక్కగా పెంచుతూ ఉండాలి వాళ్లతో ఆటలాడుకోవడం వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవడం ఇటువంటివన్నీ చాలా ముఖ్యం. భావోద్వేగ భద్రతను కల్పించాలి. మానసిక సమతౌల్యం చెడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మానసికంగా పిల్లలు బాగుండేటట్టు చూసుకోవాలి. అలానే శారీరకంగా కూడా వాళ్ళు బాగుండేటట్టు చూసుకోవాలి. ఏది ఏమైనా తల్లిదండ్రులు ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా వాళ్ళ యొక్క పిల్లల్ని ఉన్నత శిఖరాలని చేరుకునేలా చేయొచ్చు.