కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్ ఇచ్చారు. దొరల ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని సీఎం కేసిఆర్ గ్రహించాలని కోరారు. ప్రభుత్వం ఆర్భాటాపు ఉత్సవాలు చేస్తుందని.. సమస్యలు పక్కదారి పట్టించే పనిలో పడింది ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు.
కేసీఆర్.. బంగాళా ఖాతం లో కాంగ్రెస్ ను కలుపుతారు అంటా… కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటి అని నిలదీశారు. బీజేపీ..brs ఒక్కటై రాజకీయ డ్రామాలు బయట పడుతున్నాయని నిప్పులు చెరిగారు. రైతులు…పంట తడిసి ఇబ్బంది పెట్టి వేడుకలు చేసుకుంటుందని.. ధరణి లో తప్పులు సరిదిద్దకుండా… కొనసాగిస్తా అంటున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. చిన్న రైతుల సమస్య సీఎం కేసీఆర్‌కు ఏం తెలుసు అన్నారు. ధరణి రైతుల సమస్య..క్షేత్ర స్థాయికి వచ్చి చూస్తే తెలుస్తోందని.. కవిత ఒక్కతి బాగుంటే తెలంగాణ లో మహిళలు అంతా సంతోషంగా ఉన్నట్టా అని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.