కిడ్నీలు క్లీన్‌ చేయాలంటే ఈ డ్రింక్స్‌ తాగాల్సిందే.. ఆరోగ్యంతో పాటు అందం కూడా..!

-

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు..కళ్ల కంటే.. ఉన్న అవయవాల్లో కిడ్నీ మూలం. ఈ కిడ్నీలు సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. తినలేరు..తిన్నది అరగదు..కంపెనీ ఫౌండరే సరిగ్గా లేకపోతే ఇక ఆ కంపెనీ ఎలా లాభాల్లో నడుస్తుంది..అలాగే కిడ్నీ పరిస్థితి కూడా. ఇది పీకిందంటే..మొత్తం సిస్టమే పాడవుతుంది. అయితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండానికి ఏం చేయాలో మనకు తెలియకపోయినా.. ఏం చేస్తే దెబ్బతింటాయో మాత్రం బాగా తెలుసు.. పోయి పోయి అదే చేస్తాం. తినకూడని తినటం, అవసరానికి మించి తాగడం..సరే పోనీ..లైఫ్‌ అంటే ఎంజాయ్ చేయాలి, తినాలి అనుకుందాం.. వాటితో పాటు ఈ డీటాక్స్‌ డ్రింగ్స్‌ కూడా తాగితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయిగా.. మరి అవేంటంటే..!

కిడ్నీ డీటాక్స్ డ్రింక్స్..

యాపిల్ వెనిగర్‌: యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సిడ్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించడంతో పాటు మూత్రపిండాల్లో టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దీని సహాయంతో డిటాక్స్ డ్రింక్ సిద్ధం చేయవచ్చు. దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలపి ప్రతిరోజూ తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలు డీటాక్స్‌ అవుతాయి.

దానిమ్మ రసం: దానిమ్మలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కావున ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు ఈ రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అందుకే ప్రతిరోజూ తాజా దానిమ్మ రసాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఖరీదైనది కాబట్టి కొనగలిగితే ఓకే లేకపోతే మనలాంటోళ్ళ కోసం ఇంకో రసం ఉంది.. అదే బీట్‌ రూట్‌ రసం..

బీట్‌రూట్ రసం: బిట్ రూట్ రసంలో బీటైన్ ఉంటుంది. ఇది చాలా ప్రయోజనకరమైన ఫైటోకెమికల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే కిడ్నీలు డిటాక్స్ చేయడంతో పాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇంకా ఇది స్కిన్‌కు కూడా మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version