Breaking : ఐటీ శాఖలో భారీ బదిలీలు

-

దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ (సీబీడీటీ) కార్యదర్శి రాఘవేంద్ర సింగ్‌ కుశ్వక్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ ఐటీ విభాగం డీజీ(ఇన్వెస్టిగేషన్‌) వసుంధర సిన్హా ముంబైకి బదిలీ కాగా, ఆమె స్థానంలో సంజయ్‌ బహదూర్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. నగరంలోనే పనిచేస్తున్న శిశిర్‌ అగర్వాల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌గా నియమితులయ్యారు. కొంత కాలంగా తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఢిల్లి లిక్కర్ స్కామ్ లో సీబీఐతో పాటు ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఫీనిక్స్ గ్రూప్ పై దాడులు జరిగాయి. వాసవి గ్రూప్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఇవన్ని సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల టార్గెట్ గానే జరిగాయనే టాక్ వస్తోంది. రెండు నెలల క్రితమే హైదరాబాద్ ఈడీ అధికారిని మార్చింది కేంద్రం. దినేష్ పరుచూరికి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాతే ఈడీ దాడులు పెరిగాయి. తాజాగా ఐటీ శాఖలో బదిలీలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేషనల్ పోలీస్ అకాడమిలో బస చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఇన్‌కమ్ టాక్స్ అధికారులతో సమీక్ష చేశారనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఐటీ శాఖలో బదిలీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు ఇక్కడ విధుల్లో ఉన్న అధికారులు.. టీఆర్ఎస్ నేతల విషయంలో మెతక వైఖరితో ఉన్నారని గ్రహించడం వల్లే బదిలీ చేశారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హా.. తెలంగాణ ఏసీబీ చీఫ్ అంజనీకుమార్ సతీమణి. అంజనీకుమార్ కు కేసీఆర్ ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన హైదరాబాద్ కమిషనర్ గా సుదీర్ఘ కాలం పని చేశారు. తర్వాత ఆయనకు కీలకమైన ఏసీబీ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగానే వసుందర సిన్హాకు తప్పించారని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version