గ్యాస్ స్టవ్ మీద జిడ్డు పోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఇంటిని బాగా క్లీన్ చేసుకోవాలని, ఎలాంటి జిడ్డు, మరకలు, దుమ్ము లేకుండా ఉండాలని చూసుకుంటూ ఉంటారు. అయితే అన్ని గదులు శుభ్రం చేయడం ఒకే ఎత్తైతే వంటిల్లు, వంటింట్లో జిడ్డు, మరకలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎంత రుద్దినా కూడా పోవు గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి కూడా పెద్ద తలనొప్పి. అన్ని మనం స్టవ్ మీద వండుకుంటాం కాబట్టి నూనె జిడ్డు వలన గ్యాస్ స్టవ్ చూడడానికి బాగా కనపడదు. జిడ్డు పోగొట్టాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి.

స్టవ్ మీద మరకలు పడినప్పుడు అది ఆరిపోయి ఆ మరకలు పోవు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇలా చేస్తే ఈజీగా గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసుకోవచ్చు. మరకలు అన్నీ కూడా ఈజీగా పోతాయి. గోరువెచ్చని నీళ్లలో కొంచెం సర్ఫ్ వేసి కలిపి ఆ నీళ్లతో మీరు గ్యాస్ స్టవ్ ని తుడిచారంటే పది నిమిషాలలో మరకలు అన్నీ కూడా పోతాయి. ఈజీగా స్టవ్ క్లీన్ అయిపోతుంది.

కాబట్టి గ్యాస్ స్టవ్ పై మరకలు పోగొట్టడానికి మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఆ మొత్తం మరక పోయిన తర్వాత పొడి గుడ్డతో మీరు మళ్ళీ తుడుచుకోవచ్చు. బేకింగ్ సోడా ని స్టవ్ మీద జల్లి నిమ్మకాయని రుద్దితే కూడా జిడ్డు మొత్తం పోతుంది. ఒక గిన్నెలో నీళ్లు వేసి, డిష్ వాష్ లిక్విడ్ లేదంటే సబ్బుని బేకింగ్ సోడాని కలిపి స్టవ్ మీద రుద్దితే కచ్చితంగా త్వరగా మరకలు పోతాయి. బేకింగ్ సోడా ఉప్పు వేసుకుని కూడా మీరు పేస్ట్ చేసుకొని పొయ్యి మీద స్క్రబ్ చేయాలి. అలా పది నిమిషాలు వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా సులభంగా స్టవ్ మీద ఉండే జిడ్డు మరకలు అన్నీ పోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news