తొమ్మిది రోజులు, ఆరు పుణ్యక్షేత్రాలు.. ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల తో చాలా మంది నచ్చిన ఊళ్లు వెళ్లి వస్తున్నారు. తమిళనాడులోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేందుకు దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీ ని తెచ్చారు. తొమ్మిది రోజులు, ఆరు పుణ్యక్షేత్రాలు తో దీన్ని తీసుకొచ్చారు. అరుణాచలం, మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి ఇలా ఎన్నో చూసి రావచ్చు.

ఆగస్టు9, సెప్టెంబర్‌ 5 ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ తో తిరువణ్ణామలై (అరుణాచలం ఆలయం). రామేశ్వరం(రామనాథస్వామి ఆలయం), మధురై (మీనాక్షి అమ్మన్ ఆలయం), కన్యాకుమారి (రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్), త్రివేండ్రం(శ్రీ పద్మనాభస్వామి ఆలయం), తిరుచ్చి(శ్రీ రంగనాథస్వామి ఆలయం).

తంజావూరు(హదీశ్వరాలయం) కవర్ అవుతాయి. సికింద్రాబాద్‌ లో ప్రారంభమై ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టేషన్స్ లో ప్రయాణికులు ఎక్కచ్చు. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూసి ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news