కొంతమంది పళ్ళు గార పట్టేసి ఉంటాయి. చూడడానికి అసలు అందంగా కనపడవు పైగా పళ్ళు గార పట్టేసినట్లయితే నవ్వినప్పుడు కూడా అసహ్యంగా కనపడుతూ ఉంటుంది. దంతాలపై గార తగ్గి తెల్లగా మీ దంతాలు మారాలంటే ఇలా చేయండి. వెంటనే మీ పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి గార మొత్తం కూడా పోతుంది. కొబ్బరి నూనె పసుపు మిశ్రమం ఇందుకు బాగా పనిచేస్తుంది ఒక కప్పులో మీరు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అందులో మూడు చుక్కల కొబ్బరి నూనె వేసుకోండి. పేస్ట్ లాగా చేసుకుని పళ్ళకి మృదువుగా అప్లై చేయండి.
తర్వాత నీటితో కడిగేసుకోండి. ఇలా చేయడం వలన సులభంగా పంటి గార వదిలిపోతుంది. పండ్లు యొక్క తొక్కలు కూడా అందుకు ఉపయోగపడతాయి. నిమ్మ అరటి లేదంటే ఆరెంజ్ తొక్కలతో దంతాలని తోముకుంటే వెంటనే గార తొలగిపోతుంది. దంతాలు తెల్లగా ఉంటాయి పరిశుభ్రంగా ఉంటాయి. వేప పుల్లతో పళ్ళు తోముకుంటే కూడా ఈ సమస్య నుండి బయటపడొచ్చు. వేప పుల్లల్లో చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి బ్యాక్టీరియాని ఇవి నిరోధిస్తాయి. పంటి గారని తగ్గిస్తాయి.
అలానే గార తొలగిపోవాలంటే బేకింగ్ సోడా పట్టికపొడి సమాన మొత్తంలో కలుపుకోవాలి బ్రష్ మీద వేసి నీటితో కడిగేసుకోవాలి ఇలా ఈజీగా మీరు పంటి మీద గారని తొలగించుకోవచ్చు. ఎండిన తులసి ఆకులని పొడి కింద చేసుకొని ఆవనూనె అందులో కలిపి పేస్ట్ లాగ చేసుకుని దంతాలకి మృదువుగా పట్టించాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు ఈజీగా గార వదిలిపోతుంది పళ్ళు ఎంతో అందంగా మెరిసిపోతాయి తెల్లగా వచ్చేస్తాయి.