అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా.?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటూ.. భారీ పాపులారిటీ దక్కించుకుంటున్న అల్లు అర్జున్ తాజాగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది.

ఇదిలా ఉండగా ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల పారితోషకం తీసుకునే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు? ఆయన మొదటి సంపాదన ఎంత? అనే విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకెళితే సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఇంటర్న్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసేవారట అల్లు అర్జున్. ముఖ్యంగా ఆయనకు యానిమేటెడ్ డిజైనర్ అంటే ఎక్కువగా ఆసక్తి ఉండేదని.. అందుకే ఇంటర్న్ ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశారని సమాచారం. అయితే ఇలా పని చేయడం వల్ల నెలకు 35 వేల రూపాయల పారితోషకం ఇచ్చేవారట. ఇక ఇదే తన మొదటి సంపాదన అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అల్లు అర్జున్.

ఇక ఇండస్ట్రీలోకి రాకముందు ఇలాంటి పనులు చేసి డబ్బు సంపాదించే వారట. అలా నాడు రూ.35 వేలకు పని చేసిన అల్లు అర్జున్ నేడు ఒక్కో సినిమాకు రూ .100 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకునే స్థాయికి ఎదగడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి.ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాతో మరో రికార్డ్ సృష్టించబోతున్నారు అల్లు అర్జున్.

Read more RELATED
Recommended to you

Latest news