పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను నిత్యం తీసుకున్నా అధిక బరువును తగ్గించుకోవచ్చు. పొటాషియం వల్ల మన శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది నేటి తరుణంలో చాలా మందికి తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. శరీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది నిత్యం వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం వంటి పనులు చేస్తున్నారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటుంటే దాంతో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మరి అధిక బరువు తగ్గాలంటే నిత్యం తీసుకోవాల్సిన ఆ పోషకాలు ఏమిటంటే…
1. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తినాలి. ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఆహారాలను.. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం తగ్గుతుంది. దీంతో ఆటోమేటిగ్గా తక్కువ ఆహారం తింటారు. తక్కువ క్యాలరీలు లభిస్తాయి. దీని వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
2. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను నిత్యం తీసుకున్నా అధిక బరువును తగ్గించుకోవచ్చు. పొటాషియం వల్ల మన శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
3. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తింటుంటే బరువు త్వరగా తగ్గవచ్చు. స్థూలకాయాన్ని తగ్గించే శక్తి కాల్షియంకు ఉంది.
4. మెగ్నిషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.