మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే..ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా?

-

జీవిత భాగస్వామిని ఎంచుకోవటం అంటే..మన జీవితంలో కొత్త మార్పులు ఆహ్వానించటమే. పెళ్లి విషయంలో ఏజ్ అనేది చాలా ముఖ్యం.  ఇక అమ్మాయిలు కూడా తమ కంటే చాలా పెద్ద వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. ఏజ్ గ్యాప్ అసలు ఎంత ఉండాలి..? దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుందనే విషయం కూడా చాలా ముఖ్యం. .పెళ్లికి సిద్ధపడే యువతీ యువకులు.. ముఖ్యంగా ఈ ఏజ్ గ్యాప్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కొందరు పెళ్లి చేసుకునే దంపతులు ఏజ్ గ్యాప్ రెండు సంవత్సరాలు ఉండేలా చేసుకుంటారు. ఒకప్పుడు అంటే బాల్యవిహాలు అవటం..ఎక్కువు వయుసున్న వాళ్లని చేసుకోవటం జరిగేది కానీ ఇప్పుడు అలా లేదు. ఏజ్ గ్యాప్ అసలు ఎంత ఉండాలి..? ఎంత గ్యాప్ ఉన్న దంపతులు.. వారి జీవితాన్ని ఆస్వాదించగలరు అనే దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

marriage5-7 ఏజ్ గ్యాప్..

ఇంత ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకునే దంపతుల మధ్య గొడవలు, అపార్థాలు, వాదనలు వంటి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయట. ఈ ఏజ్ గ్యాప్ తో ఉన్న దంపతుల్లో ఎవరో ఒకరు మెచ్యూరిటీ కలిగి ఉంటారు. దాదాపు గొడవలు రాకుండా చూసుకుంటారు. వచ్చినా వెంటనే సర్దుమణిగేలా చేస్తారు. వివాహ బంధం కుప్పకూలిపోకుండా జాగ్రత్తపడతారు. ఈ గ్యాప్ ఉన్నవారు.. ఒకరినొకరు తొందరగా అర్థం చేసుకుంటారట. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారట.

10 ఏళ్ల ఏజ్ గ్యాప్..

ఇది కాస్త ఎక్కువ ఏజ్ గ్యాపే.. ఈ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉన్నవారు.. చాలా మందే ఉన్నారు. అయితే కొందురు ఇదే ఏజ్ గ్యాప్ కారణంగా గొడవలు పడి విడిపోయారు కూడా. పది సంవత్సరాల గ్యాప్ అంటే.. దాదాపు ఒక తరానికి మధ్య తేడా ఉన్నట్లే కదా… దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోకలిగితే ఎలాంటి గొడవలు రావు..కానీ ఒక్కసారి బేధాభిప్రాయాలు వస్తే మాత్రం.. మళ్లీ సర్దుకోవడం చాలా కష్టం.

20 ఏళ్ల ఏజ్ గ్యాప్..

20ఏళ్ల ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. . ఇంత గ్యాప్ తో పెళ్లి అస్సలు చేసుకోకూడదు. ఏ ఒక్క విషయంలోనూ అభిప్రాయాలు కలవవు. లక్ష్యాలు, ఆశయాలు, అభిప్రాయాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ వ్యత్సాసం ఉంటుంది. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లు ఆలోచనలు తక్కువ ఏజ్ ఉన్న వారికి చేదస్తంగా అనిపిస్తాయి. అలాగే తక్కువ ఏజ్ ఉన్న వాళ్లు చేసే పనులు ఎక్కువ ఏజ్ ఉన్నవారికి చిన్నపిల్లల చేష్టలుగా అనిపిస్తాయి. కలిసి బయటకు వెళ్లినా ఎవరూ భార్యభర్తలు అని అనుకోరు. అన్నింటికంటే పెద్దది పిల్లలను కలిగి ఉండటం.. పెద్ద జీవిత భాగస్వామి వీలైనంత త్వరగా పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటారు కానీ చిన్న జీవిత భాగస్వామి ఈ అవకాశంపై అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. వారి ఆలోచనా స్థాయిలలో వ్యత్యాసం అతిపెద్ద లోపాలలో ఒకటి.
 పెళ్లికి ఏజ్ గ్యాప్ మ్యాటరేనా..? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. అసలే పెళ్లైయ్యాక గొడవలు కామన్..ఇంకా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్లను చేసుకుంటే నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు. బంధాలు బలంగా పదిలంగా ఉండాలంటే..మీ ఏజ్ కు దగ్గర్లో ఉన్న వాళ్లను చేసుకోవటం అన్నివిధాలు శ్రేయస్కరం. మరీ ఎక్కువుగా వద్దు, మరీ తక్కువగా వద్దూ అంటుననారు నిపుణులు

Read more RELATED
Recommended to you

Exit mobile version