శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే డబ్బులకు డోకా ఉండదు..!!

-

మన దేశంలో ఒక్కో దేవుడుకు ఒక్కో రోజు అంటే ఇష్టం ఉంటుంది.. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీదేవి సంపద, కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నం. మాతా లక్ష్మి అనుగ్రహం తో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీ దేవిని సంపదల దేవత అని కూడా అంటారు, కాబట్టి లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వస్తుంది..

అయితే అమ్మవారిని శుక్రవారం రోజు ఉదయం కాకుండా సాయంత్రం పూజించడం మంచిదని పండితులు చెబుతున్నారు.. రాత్రి 9,10 గంటల సమయంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయట.. ఉదయం లేచి ఇల్లు, మూలలు శుభ్రం చేసి, స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి, ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి.. అమ్మవారికి ముగ్గు అంటే చాలా ఇష్టం.. అందుకే శుక్రవారం పెద్ద ముగ్గు వెయ్యడం మర్చిపోకండి.. అదే విధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్ట గంధాన్ని శ్రీ యంత్రం, లక్ష్మీ దేవికి తిలకంగా పెట్టాలి.. లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఎప్పుడు ఉత్తర దిశలో పెట్టి పూజించాలి.. దక్షణ దిశలో పొరపాటున కూడా పెట్టకండి..అది యముడి స్థానం..

అయితే.. ఇంట్లో ఒక లక్ష్మీ దేవి మాత్రమే పెట్టుకోవాలి..అలా లక్ష్మీదేవికి సంబంధించిన ఎక్కువ చిత్రపటాలను, విగ్రహాలను పెట్టుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. నిష్ఠగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.. డబ్బులకు డోకా ఉండదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version