ఈ రోజు సాయిబాబాకు ఇలా పూజలు చేస్తే సకల కష్టాలు తొలగుతాయి..!

-

గురువారం అంటే బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు..అందుకే బాబాను పూజించేవారు గురువారంనాడు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు..ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. వేదాలను రచించిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని పురాణాల్లో పేర్కొన్నారు. ఆయన నాలుగు వేదాలను రచించిన మహర్షి, అందుకే వేల సంవత్సరాలుగా ఈ రోజున గురువును ఆరాధించే సంప్రదాయం కొనసాగుతోంది..

జూలై 13 న గురు పౌర్ణమి జరుపుథారు.ఆ రోజున 4 రాజయోగాలు ఏర్పడుతాయి..

గురు పూర్ణిమ నాడు గ్రహాలు, రాశుల కలయిక వల్ల 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున బృహస్పతి, కుజుడు, బుధుడు మరియు శని గ్రహాలు శుభ స్థానంలో ఉంటాయి. రుచక్, హన్స్, షష్, భద్ర యోగాలు గ్రహాల ప్రత్యేక స్థానం ద్వారా ఏర్పడతాయి. అంతే కాదు ఈ రోజున బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. అందుకే ఈ ఏడాది గురు పూర్ణిమకు మరింత ప్రత్యేకత ఉంది.

గురువు జీవిత లక్ష్యం సాధించే మార్గాన్ని చెబుతాడు. అందుకే గురు పూర్ణిమ నాడు గురుపూజకు విశేష ప్రాధాన్యతను చెప్పబడింది..అందుకే ఆ రోజు ఎంతో ముఖ్యమైనది.

గురు పౌర్ణమి ముహుర్తం.. 

ఈసారి గురు పూర్ణిమ బుధవారం, జూలై 13న ఉంటుంది. గురు పూర్ణిమ జూలై 13న తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 14వ తేదీ గురువారం ఉదయం 12:06 గంటలకు ముగుస్తుంది.

సాయినాథుడికి ఇష్టమైన రోజు, ఈ రోజున ప్రత్యేకంగా సాయినాథుడి గుడికి వెళ్లి ఆరాధన చేయాలి, సాయి భజనలో పాల్గొంటే, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సకల అశుభాలు దూరం అవుతాయి..భక్తితో పిలిస్తే సాయి కరునిస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news