జీవన్ లైట్ బ్యాటరి వెంటిలేటర్ తయారు చేసిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు…!

-

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సిఎఫ్‌హెచ్‌ఇ) ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ తక్కువ ఖర్చుతో, పోర్టబుల్, అత్యవసరంగా వినియోగించుకోవడానికి గానూ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ‘జీవన్ లైట్’ అనే పేరు పెట్టారు. ఈ పరికరం రోగులకు వైద్యం చేసే వారికి రక్షణ కల్పిస్తుంది. ఇక దీనిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్-ఎనేబుల్ మరియు ఫోన్ యాప్ ద్వారా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది.

ఇక దీనిని బ్యాటరి తో పని చేసే విధంగా తయారు చేసారు. దీనితో విద్యుత్ సమస్య లేకుండా వాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ సరఫరా లేని చోట దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ భాగస్వామి సహకారంతో రోజుకు కనీసం 50 నుండి 70 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్పందించిన ప్రొఫెసర్ B.S. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ, “COVID-19 బారిన పడిన సీనియర్ సిటిజన్లు మరియు వృద్ధ రోగులకు జీవితాన్ని ప్రసాదించడానికి గాను…

సహాయం కోసం వెంటిలేటర్లు అవసరమని పేర్కొన్నారు. వైద్య సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇది ఇన్వాసివ్ మరియు నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ రెండింటినీ చేయగలదట. ఇది పీడియాట్రిక్ మరియు వయోజన రోగులకు ఉపయోగించబడుతుందని పరిశోధకులు చెప్పారు. రీచార్జ్ చేసుకునే లిథియం-అయాన్ బ్యాటరీలపై విద్యుత్ సరఫరా లేకుండా ఐదు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందట. 2020 ఏప్రిల్ మొదటి వారంలో పంపిణీ చేయగలరనే నమ్మకంతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news