ఇది అత్యంత ఆనందమైన క్షణాల్లో ఒకటి : ఇలియానా

-

గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. గర్భం దాల్చేందుకు కారణం ఎవరో చెప్పకుండా దాచిపెడుతున్న బ్యూటీ.. ప్రజెంట్ ఈ ప్రయాణంలో లావెక్కడంపై మాట్లాడింది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, తన బేబీ హార్ట్ బీట్ ను తొలిసారి వినడం అత్యంత ఆనందమైన క్షణాల్లో ఒకటని చెప్పింది. ఎంతటి ఆనందాన్ని పొందానో మాటల్లో చెప్పలేనని అంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం అనేది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదని చెప్పింది.

మన శరీరం చెప్పేదే మనం వినాలని, ఎవరో చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. తాను కూడా
మనిషినేనని, కొన్నిసార్లు తాను కూడా బాధపడ్డానని చెప్పింది. తన చుట్టూ ఉన్న వ్యక్తులు గొప్పవారని, తనలో ఒక జీవి ప్రాణం
పోసుకుంటోందనే విషయాన్ని తరచూ గుర్తు చేసేవారని తెలిపింది. తనకు ఇండియన్ ఫుడ్ తినాలని ఉందని, ముంబై ఫుడ్ ను బాగా మిస్ అవుతున్నానని చెప్పింది. ప్రస్తుతం ఇలియానా కెరీర్ కు బ్రేక్ తీసుకుని విదేశాల్లో ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version