అక్రమంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. అద్దంకిలో కలకలం

-

ప్రకాశం: కరోనా వ్యాక్సిన్ అక్రమార్కుల పాలవుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ను అక్రమంగా అమ్ముకుంటున్నారు. కరోనా వంక చూపి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ అద్దంకిలో బయటపడింది. ఏఎన్ఎమ్ పద్మావతి.. తన ఇంట్లో పెద్ద ఎత్తున పలువురికి అక్రమంగా వాక్సిన్ వేస్తున్నారు. పద్మావతి.. అద్దంకి మండలం మోదేపల్లి ఆస్పత్రిలో ఏఎన్ఎం‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో ప్రజలకు వేసేందుకు తనకు ఇస్తున్న వాక్సిన్‌ను అక్రమంగా దారి మల్లిస్తున్నారు. తన చేతికి వాక్సిన్ రాగానే సంప్రదింపులు జరిపిన వారితో బేరసారాలు చేస్తున్నారు. బేరం కుదిరితే తన ఇంటి వద్దనే వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వాక్సిన్ కోసం పలు ప్రాంతాల వ్యక్తులు భారీ ఎత్తున ఏఎన్ఎం పద్మావతి ఇంటికి తరలి వస్తున్నారు.

కోవిషీల్డ్‌తో పాటు అందుబాటులో లేని కొవాక్సిన్ టీకాను కూడా సంబంధిత వ్యక్తులకు వేస్తున్నారు. ఇంటి వద్ద వాక్సిన్ వేసేందుకు ఏఎన్ఎం భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత వ్యవహారం జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వాక్సిన్ పక్క దారి పట్టడంపై స్థానికులు, నేతలు భగ్గుమంటున్నారు. ఇలాంటి అక్రమార్కుల వల్ల సామాన్యులకు వాక్సిన్ కావాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోపిస్తుననారు.

Read more RELATED
Recommended to you

Latest news