ఆ గ్రామంలో సొంత ఎన్నికలు.. EVMలపై అనుమానంతో..?

-

ప్రస్తుతం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా EVMలపై అనుమానం అనేది మాములు అయ్యింది. ఓడిన వారు EVMల్లో ఏదో గోల్ మాల్ జరిగింది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యే మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగ్గా అక్కడ కూడా EVMలపై అనుమానం అనేది వ్యక్తం చేసారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఆ ఒక్క గ్రామం మాత్రం EVMలపై అనుమానంతో సొంత ఎన్నోకలు నిర్వహించడానికి సిద్ధం అయ్యింది. సోలాపూర్ లోని మర్కద్వాడి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అక్కడ ఎలక్షన్ లలో మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ఉత్తమ్‌రావు జన్‌కర్‌ 13 వేల ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కానీ ఈ మర్కద్వాడి గ్రామంలో మాత్రం బీజేపీకి చెందిన ప్రత్యర్థి రామ్‌ సత్పుట్ కన్నా ఉత్తమ్‌రావు కు ఓట్లు తక్కువ వచ్చాయి. దాంతో ఆ గ్రామంలోని కొందరు EVMలపై అనుమానం వ్యక్తం చేస్తూ.. బ్యాలెట్ పేపర్లతో తమ గ్రామంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రచారం చేసారు. అయితే విషయం తెలుసుకుఆ అధికారులు.. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను అడ్డుకున్నారు. ఏది ఏమైనా EVMలపై అనుమానంతో సొంత ఎన్నికలు అనే అంశం ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news