వ్యవసాయ, అనుబంధారంగాల ప్రగతిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత తెలుసుకొని పనిచేయాలని చెప్పారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుండి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేసారు తుమ్మల.
అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సాహం ఇవాలన్నారు.ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరములో ఇంకో 1000 రైతువేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించనున్నారు. ఇక రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం చేసినట్లు పేర్కొన మంత్రి.. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.