కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది : ఆది శ్రీనివాస్

-

హైకోర్టు ఇచ్చిన తీర్పు కేటీఆర్ కి చెంపపెట్టు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించిన కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశాడు. కానీ ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోతాడనే భయం బీఆర్ఎస్ కు పట్టుకుంది. అవినీతి అక్రమాల నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడు. హరీష్ రావు రాజకీయ కక్ష సాధింపు చర్యలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి పైన వందకు పైగా కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ  రాజకీయ కక్ష సాధింపు తోనే పెట్టినవా అని ప్రశ్నించారు.

రాజకీయ కక్ష సాధింపులతో ప్రశ్నించే గొంతులను అరెస్టు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల కు వస్తే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. విచారణకు వెళ్లడానికే కేటీఆర్ భయపడ్డాడు. ఏసీబీ అధికారుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే విచారణకు వెళ్లలేదు. కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది. రైతు భరోసా  ప్రకటన తో రైతులు సంతోషంగా ఉన్నారు.. సంతోషంగా లేనిది బీఆర్ఎస్ పార్టీనే. కేటీఆర్.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నారు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినప్పుడు కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తే అది ఆయన కర్మ.. చేసిన అవినీతి , అక్రమాల వల్లనే కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news