క‌రోనా వ్యాక్సిన్ల‌తో రోగ నిరోధ‌క‌త 9 నెల‌ల : ఐసీఎంఆర్

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుంది. దీంతో బూస్ట‌ర్ డోసు పై చ‌ర్చ జ‌రుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్ల ప‌ని తీరు పై కూడా చ‌ర్చ న‌డుస్తుంది. అయితే భారత్ లో ఉన్న క‌రోనా వ్యాక్సిన్ల పై ఐసీఎంఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్ లో ఉన్న క‌రోనా వ్యాక్సిన్ల‌తో 9 నెల‌లు శ‌రీరంలో రోగ నిరోధ‌క‌త ఉంటుంద‌ని ఐసీఎంఆర్ ప్ర‌క‌టించింది. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో 9 నెల‌ల కంటె ఎక్కువ కూడా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి ఉంటుంద‌ని తెలిపింది. అలాగే క‌రోనా వైర‌స్ సోకి కోలుకున్న వారిలోనూ రోగ నిరోధ‌క శ‌క్తి 9 నెల‌ల పాటు ఉంటుంద‌ని తెలిపింది.

టీకా తీసుకున్న వారికి, క‌రోనా నుంచి కోలుకున్న వారి కంటే.. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న త‌ర్వాత‌ టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఇంకా పెరుగుతుంద‌ని వెల్ల‌డించారు. అలాగే గ‌తంలో క‌రోనా వైర‌స్ ఎలా మ‌నుషుల‌కు సోకుతుందో.. అలాగే కొత్త వేరియంట్లు సోకుతున్నాయ‌ని తెలిపారు. దీని వ‌ల్ల వైద్య విధానం పై ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని సూచించారు. రెండు డోసులు తీసుకున్న వారు కూడా మాస్క్, శానిటైజ‌ర్ తో పాటే భౌతిక దూరం త‌ప్ప‌క పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news