ప్రభుత్వ సలహాదారుల నియామకం పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సలహాదారుల నియామకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకాల పైన దాఖలైన వేర్వేరు పిటిషన్ లపై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిష్ణాతులైన వారిని సలహాదారుడుగా నియమిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

అలాగే మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు ఏజీ విన్నవించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా రాజకీయాలు ఉంటే బయట చూసుకోవాలి అని.. వాటిని కోర్టు వరకు తీసుకురాకూడదని హెచ్చరించింది. ఉద్యోగుల టిఏ, డిఎ కోసం మరో సలహాదారుని నియమిస్తారా? అని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని హైకోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version