మాఘమాసంలో శుభముహూర్తాలు..
మాఘం అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలంలో శుభకార్యాలు ప్రారంభం. అందులో ఈసారి ఎటువంటి మూఢాలు లేకపోవడం గత కొన్ని నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో ఈసారి మాఘమాసంలోని శుభదినాలకు భారీగా డిమాండ్ ఉంది. మాఘమాసంలో మంచిరోజుల గురించి సంక్షిప్తంగా చూద్దాం..
ఫిబ్రవరి 8 శుక్రవారం
వివాహాలు, గృహప్రవేశాలకు అనువైన రోజు.
ఫిబ్రవరి 9 శనివారం
పుట్టెంట్రుకలు, అన్నప్రాసన, శంకుస్థాపన, ఉపనయనాలు, వివాహాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, కొత్త బోర్లు వేయుటకు అనువైన రోజు.
ఫిబ్రవరి 10 ఆదివారం
అక్షరాభ్యాసానికి విశేషమైన రోజు, పుట్టెంట్రుకలు, ఉపనయనం, వివాహం, నిశ్చయతాంబూలాలు, వ్యాపారం ప్రారంభాలకు మంచి రోజు.
ఫిబ్రవరి 11 సోమవారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వ్యాపారం తదితర శుభకార్యాలకు అనువైన రోజు.
ఫిబ్రవరి 13 బుధవారం
గృహప్రవేశాలు, వివాహాలకు అనువైన రోజు.
ఫిబ్రవరి 14 గురువారం
అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, బోర్లు వేయడానికి, గృహారంభం, ప్రవేశాలు, నిశ్చయతాంబూలం, వ్యాపారం ప్రారంభానికి అనువైన రోజు.
ఫిబ్రవరి 15 శుక్రవారం
పుట్టెంట్రుకలు, అన్నప్రాసన, ఉపనయనం, గృహప్రవేశాలు, గృహారంభం, వివాహాలకు మంచిరోజు.
ఫిబ్రవరి 16 శనివారం
గృహరంభం, గృహప్రవేశాలు, ఉపనయనం, వివాహాలకు శుభం.
ఫిబ్రవరి 17 ఆదివారం
అక్షరాభ్యాసాలు, ఉపనయనం, వివాహం, గృహారంభం, అన్నప్రాసన, వ్యాపారాల ప్రారంభానికి మంచిరోజు.
ఫిబ్రవరి 18 సోమవారం
అక్షరాభ్యాసాలు, పుట్టెంట్రుకలు, ఉపనయనం, గృహారంభం, ప్రవేశాలకు మంచిరోజు.
ఫిబ్రవరి 21 గురువారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, నిశ్చయతాంబూలాలకు మంచి రోజు.
ఫిబ్రవరి 22 శుక్రవారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, గృహారంభం,ప్రవేశాలు, నిశ్చయతాంబూలాలకు మంచిరోజు.
ఫిబ్రవరి 23 శనివారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ఆరంభం నిశ్చయతాంబూలాలకు శుభమైనరోజు.
ఫిబ్రవరి 24 ఆదివారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నిశ్చయతాంబూలం, ఉపనయనం, వివాహాలకు శుభమైన రోజు.
ఫిబ్రవరి 28 గురువారం
అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, నిశ్చయతాంబూలాలకు, శంకుస్థాపనలకు అనువైన రోజు.
నోట్
మాఘమాసంలో శుభముహుర్తాలకు మొత్తం పైన పేర్కొన్నాం. ముహ్తుర్త తేదీ, సమయాల కోసం మీమీ వ్యక్తిగత నక్షత్ర, జాతక పరిశీలన ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర్లోని పురోహితులు, జ్యోతిషులను సంప్రదించి శుభముహుర్తాలను నిర్ణయించుకోగలరు. పైన పేర్కొన్నవాటిని అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉన్నవి పేర్కొన్నాం. కొన్ని ప్రాంతాలకు కొన్ని ముహుర్తాలు సరిపోకపోవచ్చు గమనించగలరు.
– కేశవ