గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి ముఖ్య గమనిక..?

-

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దేశంలో ఈ మహమ్మారిని కొంత మేరకు అయినా అరికట్టాలని లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాల ప్రభావం పడింది. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఆ పథకాలలో గ్యాస్ కి సంబంధిచించిన సబ్సిడీలను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

gas
gas

అయితే మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా గ్యాస్ బుక్ చేసుకున్నారా? మీ అకౌంట్ లో గ్యాస్ సబ్సిడీ వచ్చిందో లేదో చెక్ చేసుకున్నారా..? మీరు అకౌంట్ లో డబ్బులు చెక్ చేసుకున్న ప్రయోజనం లేదు లేండి. గత మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ డబ్బులు రావడం లేదు. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు.

మోదీ ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో కారణాలు ఏంటో తెలుసుకుందామా. అయితే గత ఏడాది కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో సబ్సిడీ ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధర దాదాపు సమానంగానే ఉంటుంది. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని బంద్ చేసిందని నిపుణులు తెలిపారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే 14.2 కేజీల సిలిండర్లకు ఇది వర్తిస్తుందని తెలిపారు. అంతేకాక ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news