తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ రబీ సీజన్ కు కూడా సాగు విస్తీర్ణం ఉంటుందని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి వాటాలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రూ.2లక్షల రుణమాఫీ చేయడం ఇందుకు నిదర్శనం అని తెలిపారు.
రైతులు ఇబ్బందులు పడకుండా విద్యుత్ అందించాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. జనవరి 26వ తేదీ నుంచి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. రైతు భరోసా పతకం కింద రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూ.12వేలు చొప్పున అందించనుంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే.. అన్ని ఎకరాలకు ఇస్తామని ప్రకటించింది.