పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మ అంటూ ఆరోపించారు. చివరకు పుల్వామా దాడిపై కూడా సైన్యం నుంచి ఆదేశాలు వచ్చాకే స్టేట్ మెంట్ ఇచ్చారని ఆమె విమర్శించారు. పుల్వామా దాడిపై ఆయన స్పందించిన కొంత సేపటికే రెహామ్ ఖాన్ ఇటువంటి సంచలన ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
భావజాలం, ఆధునిక విధానం లాంటి వాటితో రాజీ పడి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారని ఆమె అన్నారు. ఆయన ఏదీ తన సొంతంగా చేయరని.. ఆయన ఏది చేయాలన్నా… బయటి నుంచి ఆదేశాలు రావాల్సిందేనన్నారు.
రెహామ్ ఖాన్ ది బ్రిటన్. ఆమెను 2015 లో ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది లోపే ఇద్దరు విడాకులు తీసుకున్నారు.