ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. విడుదల చేయాలని ఆదేశం..!

-

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు పేర్కొంది. మంగళవారం ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఆర్మీ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని తెలిపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తమ కస్టడీ నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం అక్రమాస్తుల నిరోధక సంస్థను ఆదేశించింది. ఇమ్రాన్‌ను అరెస్టు చట్టవిరుద్ధమన్న కోర్టు.. పాక్‌ను జైలుగా మార్చాడన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ తరఫున న్యాయవాది హమీద్‌ వాదనలు వినిపించారు. కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మినల్లా కలుగజేసుకుంటూ.. గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానకర రీతిలో నాబ్‌ అరెస్టు చేసిందని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఇస్లామాబాద్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version