75 ఏళ్లలో కానీ అభివృద్ధి 7 ఏళ్లలో చేసి చూపెట్టాం – మంత్రి హరీష్ రావు

-

సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాలు ఏ విధంగా జరుపుకున్నామో.. ఇవాళ ఎస్టియు 75 వసంతాలు జరుపుకోవడం చాలా గర్వకారణం అన్నారు.

ఐదేళ్లలో 73% ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. నేడు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు అందివ్వలేదని.. అది ఒక తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథకు బహుమతి అందించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం బడ్జెట్ను విద్యా రంగంపై పెట్టడం గర్వకారణం అన్నారు మంత్రి హరీష్ రావు.

పక్క రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణలో అమలవుతున్న పథకాలను అందించాలని అసెంబ్లీలో అడుగుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన 30 వేల కోట్ల బకాయిలను ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఆపాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. 75 ఏళ్లలో కానీ అభివృద్ధిని 7 ఏళ్లలో చేసి చూపించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news