వార్నీ : కోతులు, చింపాంజీలను జప్తు చేశారా..?

-

ఎక్కడైనా ఆస్తులను జప్తు చేయడం చూశాం.. స్థిరాస్తులనుచరాస్తులు ఏవైనా సరే అధికారులు జప్తు చేస్తారు.. అక్రమాస్తులైనా.. వివాదాల్లో ఉన్నవైనా సరే.. ఈ జప్తులు జరుగుతుంటాయికానీ.. ఏకంగా కోతులనుచింపాజీలను జప్తు చేయడం ఎక్కడైనా విన్నారా.. కన్నారా.. తాజాగా అదే జరిగిందిఎక్కడ అంటారా.. పశ్చిమ బెంగాల్‌లో..

ఇంతకీ విషయం ఏంటంటే.. పశ్చిమ బెంగాల్‌లో వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తున్న సుప్రదిప్ గుహ అనే వ్యక్తిని ఈడీ అధికారులు విచారించారుఈ సందర్భంగా ఈడీ అధికారులు మూడు చింపాజీలునాలుగు కోతులు జప్తు చేసేశారువన్యప్రాణులను అక్రమంగా కలిగి ఉన్నాడనేది ఇతనిపై ఆరోపణస్మగ్లింగ్ కేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సుప్రదిప్ గుహా పై మనీలాండరింగ్ అభియోగాలపై దర్యాప్తు చేపట్టింది ఈడీఅతని వద్దనున్న మూడు చింపాంజీలనునాలుగు కోతులను జప్తుచేసిందిఎందుకంటే.. ఈ కోతులు చాలా విలువైనవట.. అరుదైన రకాలకు చెందినవటవీటి విలువ ఎంతో తెలుసా.. ఒక్కో చింపాజీ విలువ 25 లక్షలు ఉంటుందట.

ఇక దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల విలువ ఒక్కొక్కటి లక్షన్నర వరకూ ఉంటుందటజప్తు చేసిన తర్వాత వాటిని జూకి తరలించారు ఈడీ అధికారులుఈ సంఘటనతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చరిత్రలోనే తొలిసారిగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చింపాజీలనుకోతులను జప్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version