ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కోవిడ్ -19 కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 49,553 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 6045 మంది కి కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలుపుకొని మొత్తంగా 64,713 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో ఏకంగా 1049 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 22/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZAIJedU2ZY— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020
ఇక మరోవైపు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 6,494 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో రాష్ట్రంలో 32,127 మంది కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,763 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. తాజాగా కోవిడ్ -19 బారినపడి 65 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 823 కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,35,827 శాంపిల్స్ ను పరీక్షించారు.