రోగం రావొద్దని గంగమ్మ తల్లికి పూజలు…! 144 సెక్షన్ ఉన్నా సరే…!

-

మన దేశంలో సాధారణంగా మూడ నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. జనాలకు ఏది ఎలా ఉన్నా సరే వాళ్ళ నమ్మకాలు మాత్రం మానె అవకాశం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ఇటీవల తెలంగాణాలో కొందరు యువకులు కరోనా వైరస్ రాకుండా… వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా సరే జనాలు మాత్రం పూజలు చేయడానికి వందల మంది వచ్చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి కరోనా తమ గ్రామానికి రాకుండా చూడాలి అంటూ గంగమ్మ తల్లికి పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వందల మంది ఒక్కసారే వచ్చి ఒక్క చోటే పూజలు ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటూ బొట్టు, ప్రసాదాలు తినిపించుకుంటూ పూజలు నిర్వహించారు.

ఎవరూ సామాజిక దూరం పాటించకపోగా మాస్క్‌లు కూడా ఏ ఒక్కరికి లేకపోవం ఆందోళన కలిగిస్తుంది. మాకు నువ్వే దిక్కు అంటూ వాళ్ళు అందరూ కూడా దేవతకు పూజలు చేయడం విశేషం. ఆ ఊర్లో అధికారుల మాటను కూడా ఏ ఒక్కరు లెక్క చేసే పరిస్థితి ఏ విధంగా చూసినా కనపడలేదు. దీనితో పూజలు చేసిన అందరి వివరాలను స్థానిక అధికారులు సేకరించి వారి మీద కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news