నిర్మల్ లో రూ. 43 లక్షల అల్పాజోలం, క్లోరోహైడ్రైడ్ పట్టివేత

-

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూ. 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం,. క్లోరోహైడ్రేట్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావుకు  వచ్చిన సమాచారం మేరకు నిర్మల్ లోని ద్వారకా నగర్ లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో. 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్ లోని ఒక గోదాం లో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిలువలను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.

2016 నుంచి 2024 వరకు నిందితుడుగా ఉన్న గంధం శ్రీనివాస్ గౌడ్ కి సోలాపూర్ శీను అలియాస్ భాయ్ అల్ఫాజూలాన్ని అల్ఫా సోలంను, రాజస్థాన్ కు చెందినటువంటి రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరోహైడ్రేడ్ ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారు. అయితే ఆల్ఫాజూలం, క్లోరోహైడ్రేట్  కల్తీ కళ్ళు తయారీకి వినియోగిస్తారు. పట్టుబడిన శ్రీనివాస్ గౌడ్ కల్తీ కల్లు వ్యాపారం చేయడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కల్తీ కల్లు తయారు చేసే వారికి అల్పాసోలం క్లోరోహైడ్రేడ్ ను సరఫరా చేస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news