మోడీ మెడలు వంచి విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం – వై.ఎస్ షర్మిల

-

ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో యాజమాన్యం తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. బుధవారం వీరికి సంఘీభావం ప్రకటించిన ఏపీసిసి చీఫ్ వై.ఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపును అడ్డుకోకపోతే అక్కడే నిరసనకు దిగుతానని హెచ్చరించారు.

దీంతో నేడు స్టీల్ ప్లాంట్ నుండి ఓ ప్రకటన వచ్చింది. 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు నిర్ణయం పై యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీంతో స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పై స్టీల్ ప్లాంట్ వెనక్కి తగ్గడానికి ఆమె స్వాగతించారు.

ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు షర్మిల. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని.. ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం అన్నారు షర్మిల. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news