వివాదంలో కేటిఆర్… రెండు చోట్ల ఓటు

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రముఖులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ప్రజలు పోలింగ్ బూత్ కి రాక ముందే వచ్చేసి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మంత్రులు అందరూ కూడా హైదరాబాద్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఒక విషయం వివాదంగా మారింది. మంత్రి కేటిఅర్ నందీ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆయనకు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా ఓటు హక్కు ఉంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ” అధికారం మనదైతే…చట్టం కూడా చుట్టమేనా ? మంత్రి గారికీ,ఆయన సతీమణికి అటు సిరిసిల్లలో.. ఇటు గ్రేటర్ లో రెండు చోట్ల ఓటు హక్కు… విడ్డూరం చూతము రారండీ” అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version