శర్వానంద్ అంత కష్టపడ్డా.. చివరికి తప్పదా..?

-

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో శర్వానంద్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అని ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. కాగా ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న తన 29వ చిత్రం శ్రీకారం. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటమే ఇందుకు కారణం. దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా పరిస్థితులు మొత్తం తారుమారు కావడంతో… ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను బరిలో దింపేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తున్నట్లు టాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి పై ఎంతో మంది హీరోలు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో శ్రీకారం సినిమా విడుదల కల సాకారం అయ్యేది ఓటీటీ లోనే అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాని లాంటి పెద్ద స్టార్ హీరో సినిమా ఓటిటి లో విడుదల కావడంతో.. శ్రీకారం సినిమాను కూడా విడుదల చేసేందుకు చిత్ర బంధం సిద్ధమవుతున్నట్లుగా ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news